తెలంగాణ

telangana

ETV Bharat / state

కలుషిత ఆహారం తిని బాలుడి మృతి... ఆస్పత్రిలో కుటుంబం - Hyderabad Latest News

అమెరికా వీసా కోసమని ఓ కుటుంబం హైదరాబాద్​​ వచ్చింది. ఒక రోజు ఉండాల్సి రావడం వల్ల ఓ హోటల్లో దిగింది. అదే రోజు ఆ హోటల్లో ఆహరం తీసుకున్నారు. తిన్న కొద్దిసేపటికే వాంతులయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించగా ఓ బాబు మృతి చెందగా మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

A Boy Dead With Food Poisson In Hyderabad
బాలుడి మృతి

By

Published : Feb 11, 2020, 11:37 PM IST

కలుషిత ఆహారం తిని బాలుడి మృతి... ఆస్పత్రిలో కుటుంబం

ఖమ్మంకు చెందిన రవి నారాయణ, శ్రీవిద్య దంపతులు. రవి నారాయణ బెంగళూరులో సాఫ్ట్​వేర్​​ ఉద్యోగిగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు వరుణ్​(7), విహాన్​(2) ఉన్నారు. సోమవారం అమెరికా వెళ్లేందుకు వీసా కోసమని వారు హైదరాబాద్​ బేగంపేట్​లోని ​యూఎస్ కాన్సులేట్​కు వచ్చారు. ఇక్కడే ఉండాల్సి రావడం వల్ల బేగంపేట్​ మానససరోవర హోటల్​లోని రూం నెంబర్​ 318లో దిగారు.

పోలీసులకు ఫిర్యాదు

అదే రోజు రాత్రి హోటల్లో భోజనం చేశారు. కుటుంబ సభ్యులందరికీ రాత్రి సమయంలో వాంతులు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించగా విహాన్ మృతి చెందిన్నట్లు వైద్యులు తెలిపారు. మిగతా వారికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కలుషిత ఆహారం మూలంగానే వాంతులు అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఫుడ్​ పాయిజన్​ వల్లే తన కొడుకు మరణించాడని రవి నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనుమానాస్పద కేసుగా నమోదు

అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు హోటల్లో వీరు బసచేసిన రూమ్​లో ఏమైనా విషపదార్థాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం విహాన్​ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత కథనాలు:కలెక్టర్లకు సీఎం కేసీఆర్ నిర్దేశించిన బాధ్యతలు ఇవే!

ABOUT THE AUTHOR

...view details