తెలుగు సాహిత్య కళాపీఠం 8వ వార్షికోత్సవం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేవీ రమణాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవస్థాపన దినోత్సవ ప్రతిభా పురస్కారాలను వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ప్రదానం చేశారు.
ఘనంగా తెలుగు సాహిత్య కళాపీఠం ఎనిమిదో వార్షికోత్సవం - latest news of telugu sahitya kala peetam
తెలుగు సాహిత్య కళాపీఠం 8వ వార్షికోత్సవ వేడుకలు రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువులు ప్రముఖులకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేవీ రమణాచారి ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
ఘనంగా తెలుగు సాహిత్య కళాపీఠం 8వ వార్షికోత్సవ వేడుకలు
కవి, పండిత వంటి బిరుదులతో సత్కారం చేశారు. పలురంగాల్లో సేవలందిస్తున్న ఎనిమిది మందిని... పలువురు కవులను గుర్తించి... ప్రతిఏటా సన్మానిస్తున్న కళా పీఠం నిర్వాహకులను రమణాచారి అభినందించారు. లాస్య ఫైన్ ఆర్ట్స్ అకాడమి శిష్య బృందం వారు నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది.
ఇదీ చూడండి: ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ అవుతావు: సీఎస్ జోషి