తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో పదివేలు దాటిన కరోనా కేసుల సంఖ్య - covid update in telangana

891 new corona cases were registered in telangana today
రాష్ట్రంలో పదివేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

By

Published : Jun 24, 2020, 8:25 PM IST

Updated : Jun 24, 2020, 9:09 PM IST

20:23 June 24

రాష్ట్రంలో పదివేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

పదివేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 891 కేసులు నమోదయ్యాయి. వీటితో కేసుల సంఖ్య 10వేలు దాటింది. మొత్తం బాధితుల సంఖ్య 10,444కు చేరింది. తాజాగా 5 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు వైరస్​ బారిన పడి 225 మంది మృతిచెందారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 4,361 మంది డిశ్చార్జయ్యారు. ఆస్పత్రుల్లో 5, 858 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 719 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్ జిల్లాలో 55, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6, ఖమ్మం జిల్లాలో 4, వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ జిల్లాల్లో 3, సంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో 2 కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, గద్వాల, పెద్దపల్లి, సూర్యాపేట, నిజామాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు వెలుగుచూశాయి.

ఇవీ చూడండి:కరోనా కలవర పెడుతోంది... భాగ్యనగరాన్ని వణికిస్తోంది!

Last Updated : Jun 24, 2020, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details