తెలంగాణ

telangana

ETV Bharat / state

tg corona cases: తగ్గుతున్న కరోనా తీవ్రత.. కొత్తగా 848 కేసులు - corona cases bulletin

తెలంగాణలో కరోనా వైరస్​ తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. తాజాగా 848 కేసులు వెలుగు చూశాయి. వైరస్​ కోరల్లో చిక్కి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

తగ్గుతున్న కరోనా తీవ్రత.. కొత్తగా 848 కేసులు
తగ్గుతున్న కరోనా తీవ్రత.. కొత్తగా 848 కేసులు

By

Published : Jul 3, 2021, 7:24 PM IST

Updated : Jul 3, 2021, 8:24 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా మరో 848 మంది కొవిడ్​ బారినపడినట్లు వైద్యశాఖ బులిటెన్​ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,08,954 మందికి పరీక్షలు నిర్వహించగా.. 848 మందికి వైరస్‌ నిర్ధరణ అయింది.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్​ సోకిన వారి సంఖ్య 6,26,085కు చేరింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో ఆరుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,684కు చేరింది. మరో 1,114 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 12,454 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

తాజా కేసుల్లో జీహెచ్​ఎంసీ పరిధిలో 98, ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 33, జగిత్యాల 17, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 17, జోగులాంబ గద్వాల 4, కామారెడ్డి 4, కరీంనగర్ 46, ఖమ్మం 48, కుమురం భీం ఆసిఫాబాద్ 5, మహబూబ్​నగర్ 16, మహబూబాబాద్ 31, మంచిర్యాల 49, మెదక్ 6, మేడ్చల్-మల్కాజిగిరి 45, ములుగు 25, నాగర్ కర్నూల్ 10, నల్గొండ 66, నారాయణపేట 6, నిర్మల్ 4, నిజామాబాద్ 12, పెద్దపల్లి 44, రాజన్న సిరిసిల్ల 26, రంగారెడ్డి 42, సంగారెడ్డి 11, సిద్దిపేట 21, సూర్యాపేట 58, వికారాబాద్ 5, వనపర్తి 13, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ 44, యాదాద్రి భువనగిరిలో 23 చొప్పున నమోదయ్యాయి.

ఇదీ చూడండి:Salmonella bacteria: ఆ ఆకులు తినకండి.. తింటే ఆస్పత్రికే..!

Last Updated : Jul 3, 2021, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details