తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్‌లో కలవరపరుస్తోన్న కేసులు.. కొత్త ప్రాంతాల్లో అత్యధికం - హైదరాబాద్‌ కరోనా మరణాలు

గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో పోలీసు, వైద్య, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం చర్యలు చేపడుతున్నా వైరస్‌ సవాల్‌ విసురుతోంది. ఇటీవల అధికశాతం కొత్త ప్రాంతాల నుంచి పాజిటివ్‌ కేసులు కనిపిస్తుండడం కలవరపాటు కలిగిస్తోంది. ఆదివారం 800 కొత్త కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత దూరం విస్మరించడం, జనసమూహాల్లో యథేచ్ఛగా సంచరిస్తుండడం వల్ల వ్యాప్తి పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

HYDERABAD CORONA
HYDERABAD CORONA

By

Published : Jul 13, 2020, 6:40 AM IST

మహానగరంలో విస్తరిస్తోన్న వైరస్‌ ఆందోళనకు గురిచేస్తోంది. ఆదివారం గ్రేటర్‌లో 800 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్‌లో 94 కేసులు నమోదయ్యాయి. ఇటీవల అధికశాతం కొత్త ప్రాంతాల నుంచి పాజిటివ్‌ కేసులు కనిపిస్తుండడం కలవరపాటు కలిగిస్తోంది. వ్యక్తిగత దూరం విస్మరించడం, జనసమూహాల్లో యథేచ్ఛగా సంచరిస్తుండడం వల్ల వ్యాప్తి పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం వివిధ మార్గాల్లో అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం ఉండడంలేదు.

సిబ్బందిపై పనిభారం

వైరస్‌ ఉండి లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని అనుమానితులు అక్కడకు వెళ్తున్నారు. నగరం నలువైపుల నుంచి వచ్చిన 425 మందికి నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అత్యధికశాతం మందిలో వైరస్‌ లక్షణాలున్నట్టు వైద్యులు గుర్తించారు. రోజురోజుకు పరీక్షకు వస్తున్నవారి సంఖ్య పెరగడంతో సిబ్బందిపై పనిభారం పెరిగింది. వారి సంఖ్యను పెంచాల్సి ఉంది.

సవాల్‌ విసురుతూ..

క్షేత్రస్థాయిలో పోలీసు, వైద్య, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం చర్యలు చేపడుతున్నా వైరస్‌ సవాల్‌ విసురుతోంది. ముషీరాబాద్‌ పరిధిలో 19 కేసులు నమోదయ్యాయి. సుల్తాన్‌బజార్‌ ఠాణాలో మరో నలుగురు కొవిడ్‌ బారినపడ్డారు. వీరిలో ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుల్‌, హోంగార్డు ఉన్నారు. వీరిని హోంక్వారంటైన్‌కు తరలించారు. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 23కు చేరింది. అంబర్‌పేట్‌ సర్కిలో ఒకేరోజు 23 మందికి పాజిటివ్​గా తేలింది.

ఎవరిని సంప్రదించాలంటే..

కొవిడ్‌19 పాజిటివ్‌ కేసుల పెరుగుదలతో ప్రభుత్వం టోల్‌ఫ్రీ ద్వారా వైద్యసేవలందిస్తోంది. వేలాది మంది బాధితులు ఇంటి నుంచే చికిత్స పొందుతూ వైరస్‌ నుంచి బయటపడుతున్నారని వైద్యాధికారులు తెలిపారు. లక్షణాలున్నట్టు గుర్తించగానే 104, 108కు ఫోన్‌ చేసి సలహాలు తీసుకోవచ్చు 24 గంటలూ అందుబాటులో ఉండే కాల్‌సెంటర్‌లోని టోల్‌ఫ్రీ నంబర్‌ 18005994455 కు చేసినా వైద్యనిపుణులు ఎప్పటికప్పుడు టెలీమెడిసిన్‌ ద్వారా బాధితులకు సహాయం అందిస్తారు. ఏదైనా అత్యవసర వైద్యసాయం అవసరమైనపుడు అంబులెన్స్‌ పంపేందుకు ఏర్పాట్లు చేస్తారు..

ఇదీ చదవండి:హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

ABOUT THE AUTHOR

...view details