జీహెచ్ఎం ఎన్నికల పోలింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 3.96 శాతం నమోదు కాగా... 11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భాగ్యనగర ఓటర్లు ఆసక్తి చూపడంలేదనట్టు కనిపిస్తోంది. ఉదయం ఏడింటికి ప్రారంభమైన పోలింగ్... సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 150 డివిజన్లలో.. 11 వందల22 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్ నమోదు - జీహెచ్ఎంసీ పోల్స్ 2020
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్ నమోదైంది.
11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్ నమోదు
పోలింగ్ శాతం 11 గంటల వరకు
పోలింగ్ కేంద్రం | నమోదైన శాతం |
శేరిలింగంపల్లి సర్కిల్ | 6.42% |
కొండాపూర్ డివిజన్ | 5% |
గచ్చిబౌలి డివిజన్ | 6.61 % |
శేరిలింగంపల్లి డివిజన్ | 7.80% |
చందానగర్ సర్కిల్ | 9.42% |
మాదాపూర్ డివిజన్ | 6.15% |
మియాపూర్ డివిజన్ | 9.29% |
హఫీజ్పేట్ డివిజన్ | 9.71% |
చందానగర్ డివిజన్ | 13.12% |
చంపాపేట డివిజన్ | 17% |
హయత్నగర్ సర్కిల్ | 15.69% |
Last Updated : Dec 1, 2020, 12:12 PM IST