రాష్ట్రంలో కొత్తగా 7,754 కరోనా కేసులు - కరోనా వార్తలు
10:04 May 01
కరోనాతో మరో 51మంది మృత్యువాత
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో 7,754 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడి మరో 51 మంది మృతిచెందారు. 77,930 మందికి నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా తాజా కేసులు నమోదయ్యాయి.
కరోనా నుంచి మరో 6,542 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో క్రీయాశీల కేసులు 78 వేలు దాటాయి. ప్రస్తుతం 78,888 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో కొత్తగా 1,507, మేడ్చల్ జిల్లాలో 630, రంగారెడ్డి జిల్లాలో 544, ఆదిలాబాద్ 109, భద్రాద్రి కొత్తగూడెం 108, జగిత్యాల 255, జనగామ 74, జయశంకర్ భూపాలపల్లి 73, జోగులాంబగద్వాల 100, కామారెడ్డి 143, కరీంనగర్ 281, ఖమ్మం 230, కొమరంభీం ఆసిఫాబాద్ 101, మహబూబ్ నగర్ 279, మహబూబాబాద్ 125, మంచిర్యాల 216, మెదక్ 106, ములుగు 41, నాగర్ కర్నూల్ 203, నల్గొండ 231, నారాయణ్ పేట 44, నిర్మల్ 86, నిజామాబాద్ 267, పెద్దపల్లి 162, రాజన్న సిరిసిల్ల 102, సంగారెడ్డి 325, సిద్దిపేట 279, సూర్యాపేట 242, వికారాబాద్ 242, వనపర్తి 103, వరంగల్ రూరల్ 165, వరంగల్ అర్బన్ 208, యాదాద్రి భువనగిరిలో 173మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
ఇదీ చూడండి:భారత్లో ఒక్కరోజే 4 లక్షల మందికి కరోనా