తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ద్విచక్రవాహనానికి 57 చలాన్లు - honda activa

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు జరిమానా విధిస్తారు. కానీ ఎంతమంది చలానాలు కడుతున్నారు? ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై ఒకటి కాదు రెండు కాదు 7695 రూపాయాల జరిమానా ఉన్నా రెండేళ్లుగా కట్టకుండా తప్పించుకుంటున్నాడు.

ఆ ద్విచక్రవాహనంపై 7695 రూపాయల జరిమానా

By

Published : Aug 1, 2019, 9:58 AM IST

హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని నిరంకారి కూడలిలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్​ నిబంధనలను ఉల్లంఘించిన ఓ ద్విచక్ర వాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫైన్ విధిస్తున్న సమయంలో పోలీసులు అతనిపై ఉన్న పెండింగ్​ చలాన్లు చూసి విస్తుపోయారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 57 చలాన్లు ఉన్నట్టు బయటపడింది. రాంనగర్‌కు చెందిన సురేష్‌గౌడ్‌ యాక్టివాపై రెండేళ్లుగా ట్రాఫిక్​ ఉల్లంఘనకు పాల్పడుతున్నాడు. చలాన్లకు సంబంధించిన 7695 రూపాయలు చెల్లించాల్సిందేనని పోలీసులు సూచించడం వల్ల వాహనదారుడు ఈ-సేవా కేంద్రంలో మొత్తం చెల్లించాడు. జరిమానాలు చెల్లించకుండా తప్పించుకు తిరిగే వారు తనిఖీల్లో పట్టుబడితే వాహనం స్వాధీనం చేసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఆ ద్విచక్రవాహనంపై 7695 రూపాయల జరిమానా

ABOUT THE AUTHOR

...view details