ఏపీలో కొత్తగా 70 కరోనా పాజిటివ్ కేసులు - ఏపీలో కరోనా తాజా కేసులు
ఏపీలో కొత్తగా 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కొవిడ్-19 కేసులు 2944కు చేరాయి. గడిచిన 24 గంటల్లో 55 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 792 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో 3 కోయంబేడు కాంటాక్ట్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎలాంటి మరణం నమోదు కాలేదని బులెటిన్లో పేర్కొంది.
ఏపీలో కొత్తగా 70 కరోనా పాజిటివ్ కేసులు