తెలంగాణ

telangana

ETV Bharat / state

40 రోజుల్లో 23 లక్షలు సంపాదించాడు... జైలు పాలయ్యాడు

తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించాలనే కోరికతో సాంకేతికతను ఉపయోగించి క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ముఠాను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో అందరూ విద్యార్థులే కావడం పోలీసులకు సైతం ఆశ్చర్యం కలిగించింది.ముఠా సభ్యులు సత్తెనపల్లి కేంద్రంగా బెట్టింగ్​కు పాల్పడుతూ.. తమ సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించినట్లు గుర్తించారు.

40 రోజుల్లో 23 లక్షలు సంపాదించాడు... జైలు పాలయ్యాడు

By

Published : May 5, 2019, 8:01 PM IST

దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రికెట్ బెట్టింగ్ కీలక ముఠాను ఏపీలోని గుంటూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. సత్తెనపల్లి కేంద్రంగా సాగుతున్న ఈ ఆన్​లైన్ దందాకు సంబంధించి నలుగురు కీలక సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఎంబీఏ విద్యార్థి పసుపులేటి నాగార్జున కీలక నిందితుడు కాగా.. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ కు చెందిన మరో ముగ్గురు కీలక పాత్రధారులుగా గుర్తించారు. కీలక నిందితుడు బాలరాజు నుంచి 22.60 లక్షల రూపాయలు, లాప్ టాప్, మొబైల్ ఫోన్లు, వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కీలక నిందితుడు నాగార్జునకు ఆన్​లైన్ ద్వారా భోపాల్ కు చెందిన అవదీప్ ప్రతాప్ సింగ్, అంకిత్ ద్వివేది, దివ్యాంశు సింగ్ పరిచయమయ్యారు. వీరు నలుగురు కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి 226 మందిని చేర్చుకున్నారు. వీరందరితో కలిసి క్రికెట్ బెట్టింగ్ నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు నాగార్జున కేవలం 40 రోజుల్లో 23 లక్షల రూపాయలు సంపాదించినట్లు గ్రామీణ ఎస్పీ వెల్లడించారు. బెట్టింగ్​కు పాల్పడిన వారందరూ విద్యార్థులే అని పోలీసులు తెలిపారు.

226 మంది విద్యార్థులకు కౌన్సి​లింగ్

నిందితులతో కలిసి బెట్టింగ్​కు పాల్పడిన 226 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి తల్లిదండ్రులను పిలిపించి పోలీసు ఉన్నతాధికారులు,,, కౌన్సిలింగ్ ఇచ్చి విద్యార్థులను విడిచిపెడుతున్నట్లు వెల్లడించారు. కాగా... దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా వివరాలు సేకరించేందుకు నలుగురు సభ్యుల ముఠాను పోలీసు కస్టడీ కోరనున్నామని గుంటూరు గ్రామీణ ఎస్పీ ఎస్పీ రాజశేఖర్ బాబు చెప్పారు.

40 రోజుల్లో 23 లక్షలు సంపాదించాడు... జైలు పాలయ్యాడు

ABOUT THE AUTHOR

...view details