4 People Attacked Past Food Center: సికింద్రాబాద్.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులపై జరిగిన దాడి ఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. రెండు రోజుల క్రితం ఫాస్ట్ ఫుడ్ కోసం గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు వచ్చినట్లు ఆయన వివరించారు. పార్సిల్ తీసుకుని వెళ్లే క్రమంలో ఫాస్ట్ ఫుడ్ నిర్వహకులకు.. కొనేందుకు వచ్చిన వారికి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పార్సిల్ నిమిత్తం తినడానికి ప్లాస్టిక్ ప్లేట్లు ఇవ్వగా తమకు స్టీల్ ప్లేట్లు కావాలని కొనేందుకు వచ్చినవారు గొడవకు దిగి ఫాస్ట్ ఫుడ్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డట్లు తెలిపారు. వీరు ఆకాశ్, వివేక్, అమూల్, కల్యాణ్లుగా గుర్తించారు. ఆవేశంతో ఫాస్ట్ ఫుడ్ సిబ్బందిపై రాళ్లు కుర్చీలతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడి నిర్వాహకులకు తీవ్ర గాయాలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.