హైదరాబాద్‌లో కొత్తగా 4 కొవిడ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు - telangana corona news
21:08 April 09
హైదరాబాద్‌లో కొత్తగా 4 కొవిడ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు
కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. హైదరాబాద్‌లో నాలుగు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రి, ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, చార్మినార్ లోని నిజామియా టీబీ ఆసుపత్రి, మెహిదీపట్నంలోని సరోజినీ కంటి ఆసుపత్రిలో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
కేర్ సెంటర్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మూడు నెలల పాటు కొవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణకు కోటీ 79 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ కొవిడ్ - 19 నిధుల నుంచి ఈ మొత్తాన్ని హైదరాబాద్ కలెక్టర్కు మంజూరు చేశారు. ఈ మేరకు పరిపాలనా అనుమతులు ఇస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.