రాష్ట్రంలో కొత్తగా 384 కరోనా కేసులు, 3 మరణాలు - GHMC corona cases
08:46 December 14
రాష్ట్రంలో కొత్తగా 384 కరోనా కేసులు, 3 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 384 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు 2,78,108 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,496 మంది మరణించారు. కరోనా నుంచి మరో 631 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,69,232 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 7,380 యాక్టివ్ కేసులుండగా.. 5,298 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 101 కరోనా కేసులు నమోదయ్యాయి.