గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా’ మృతదేహాలు పేరుకుపోతున్నాయి. సకాలంలో అంత్యక్రియలు పూర్తి కావడం లేదు. అశాస్త్రీయ విధానాలు, అధికారుల నిర్లక్ష్యం, బంధువుల భయాందోళనల కారణంగా మృతుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. రోజుల తరబడి పేరుకుపోవడంతో తీవ్ర దుర్గంధం వస్తోందని మార్చురీ సిబ్బంది ఆవేదన చెందున్నారు. ‘‘కొవిడ్, ఇతర దీర్ఘకాల రుగ్మతల కారణంగా రోజూ ఈ ఆసుపత్రిలో 40-50 మంది వరకు ప్రాణాలు వీడుస్తున్నారు. వాటిలో సగం మాత్రమే అదేరోజు బయటకు వెళ్తున్నాయి. మిగిలిన వాటిని మార్చురీలో ఉంచుతున్నాం. ప్రస్తుతం 300 మృతదేహాలున్నాయి. తీవ్ర దుర్వాసన వస్తోంది. గుండె రాయి చేసుకుని కాపలా కాస్తున్నాం. తక్షణం ఈ సమస్యను పరిష్కరించాలంటూ’ సిబ్బంది వాపోతున్నారు. కొందరు అధికారులు, అంబులెన్సులు, శ్మశానాల్లోని వ్యక్తులు కుమ్మక్కై అంత్యక్రియలకు రూ. 25 వేలకు పైనే వసూలు చేస్తూ మృతుల కుటుంబీకులను కుంగదీస్తున్నారు. దీంతో చాలామంది శవాలను తీసుకువెళ్లకుండా వదిలేస్తున్నారు.
ఆరోపణలు.. పరిష్కారాలు
* శవాన్ని బంధువులకు అప్పగించే ప్రక్రియను సులభతరం చేయాలి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీలో అధికారులను పెంచాలి. డెత్ సమ్మరీని వేగంగా ఇవ్వాలి. ప్రభుత్వ అంబులెన్సుల్లో మృతదేహాలను ఉచితంగా శ్మశానవాటికకు పంపే ఏర్పాట్లు చేయాలి.
* నగరంలో 800కు పైగా శ్మశానాలుంటే నాలుగింటికే కొవిడ్ శవాలను పంపిస్తున్నారు. అంత్యక్రియల్లో జాప్యానికీ ఇదీ ఓ కారణం. డబ్బులు కోసం ఆశపడి కొందరు అధికారులు ప్రైవేటు అంబులెన్సులతో కుమ్మక్కై, శ్మశానాల్లో ప్రైవేటు వ్యక్తుల ద్వారా అంత్యక్రియలు జరిపిస్తున్నారన్న విమర్శలున్నాయి. కనీసం సర్కిల్‌కు రెండు చొప్పున శ్మశానవాటికలను అందుబాటులోకి తేవాలి. హెల్త్ అసిస్టెంట్లను, ఇతరులను అక్కడ బాధ్యులుగా నియమించాలి.
* అంత్యక్రియల నిర్వహణకు రూ.25 వేలు చాలా ఎక్కువని, కట్టెలు, డీజిల్, అంబులెన్సు రవాణాతో కలిపినా అంత ఖర్చుకాదని బాధితులు అంటున్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో ప్రామాణిక ధరను నిర్ణయించకపోవడంతో ఇష్టానుసారం వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి.
కారణాలు ఎన్నో...