శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి ఎమిరెట్స్ (ఈకె 529) విమానంలో దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన దామస్ బెన్నీ అనే ప్రయాణికుడి బ్యాగులో తనిఖీలు చేపట్టగా... రూ.30,35,422 విదేశీ నగదు దొరికింది. అనంతరం నగదు స్వాధీనం చేసుకొని నిందితుడిని సంబంధిత అధికారులకు అప్పగించారు. దామస్ బెన్నీ పాస్పోర్టు ఆధారంగా నిందితుడు స్వదేశీయుడిగా గుర్తించారు.
30లక్షలకు పైగా విదేశీ కరెన్సీ పట్టివేత - AIRPORT
ఎవరికీ తెలియకుండా విదేశీ కరెన్సీని దేశం దాటించాలనుకున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా బ్యాగులో సర్దుకొని ఎయిర్ పోర్టుకు వెళ్లాడు. తనిఖీల్లో దొరికిపోయి బిక్కమొహం వేశాడు.
30లక్షలకు పైగా విదేశీ కరెన్సీ పట్టివేత