తెలంగాణలో కొత్తగా 2,932 కరోనా కేసులు, 11 మరణాలు - Telangana total corona cases
08:36 August 28
తెలంగాణలో కొత్తగా 2,932 కరోనా కేసులు, 11 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 2 వేల 932 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన 2 వేల 932తో కలిపి... రాష్ట్రంలో కొవిడ్ బాధితుల సంఖ్య లక్షా 17 వేల 415కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 799 మంది కన్నుమూశారు. 1580 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు వైరస్‌ను జయించినవారి సంఖ్య 87 వేల 675కి చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 28 వేల 941 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 22 వేల 97 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. నిన్న 61 వేల 863 కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ పరీక్షల సంఖ్య 12 లక్షల 4 వేల 343కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 520 కరోనా కేసులు వచ్చాయి. రంగారెడ్డిలో 218, మేడ్చల్ జిల్లాలో 218, కరీంనగర్‌లో 168, జగిత్యాలలో 113, ఖమ్మం 141, మంచిర్యాల 110, నల్గొండలో 159, నిజామాబాద్‌లో 129, సూర్యాపేటలో 102, సిద్ధిపేట 100 కేసులు నమోదయ్యాయి.