Telangana Covid Cases: రాష్ట్రంలో కొత్తగా 2,861 కరోనా కేసులు - తెలంగాణ వార్తలు
19:35 January 31
వైరస్ బారిన పడి మరో ముగ్గురు మృతి
Telangana Covid Cases: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. రెండు రోజులుగా నమోదవుతున్న కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 2,861 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకున్న మరో 4,413 మంది బాధితులు ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37,168 కరోనా యాక్టివ్ కేసులున్నాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ 81,486 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీలో 746 కరోనా కేసులు నమోదయ్యాయి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి:New Virus India: నియోకొవ్ వైరస్‌తో భారత్‌కు ముప్పు ఉందా?