తెలంగాణ

telangana

ETV Bharat / state

Corona:రాష్ట్రంలో కొత్తగా 2,524 కరోనా కేసులు, 18 మరణాలు - తెలంగాణలో కరోనా కేసులు

telangana covid cases
telangana covid cases

By

Published : May 31, 2021, 6:51 PM IST

Updated : May 31, 2021, 7:25 PM IST

18:48 May 31

రాష్ట్రంలో కొత్తగా 2,524 కరోనా కేసులు, 18 మరణాలు

  తెలంగాణలో కరోనా(Corona) వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 87,110 నమూనాలను పరీక్షించగా 2,524 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,78,351కి చేరింది. తాజాగా మరో 18 మంది మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 3,281కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 34,084 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది.  

 ఇవాళ 3,464 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయినట్లు పేర్కొంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 307 మందికి పాజిటివ్‌గా తేలింది. నల్గొండ జిల్లాలో 183, రంగారెడ్డి 142, ఖమ్మం 134, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 128 కరోనా కేసులు నమోదయ్యాయి.

Last Updated : May 31, 2021, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details