తెలంగాణ

telangana

ETV Bharat / state

గుడ్​న్యూస్​.. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి - తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల వార్తలు

గుడ్​న్యూస్​.. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి
గుడ్​న్యూస్​.. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి

By

Published : Jul 22, 2022, 7:18 PM IST

Updated : Jul 22, 2022, 7:50 PM IST

19:16 July 22

గుడ్​న్యూస్​.. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి

రాష్ట్రప్రభుత్వం మరో 2,440 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. విద్యాశాఖ, ఆర్కైవ్స్​ శాఖల్లో​ ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్మీడియెట్ కమిషనర్ పరిధిలో 1,523 పోస్టులున్నాయి. ఇందులో 1,392 మంది జూనియర్ లెక్చరర్ పోస్టులు కాగా.. 40 లైబ్రేరియన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చారు. ఆర్కైవ్స్ విభాగంలో 14 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పరిధిలో 359 పోస్టులున్నాయి. అందులో 247 లెక్చరర్ పోస్టులతో పాటు 14 ఇన్​స్ట్రక్టర్, 31 లైబ్రేరియన్, 5 మాట్రన్, 25 ఎలక్ట్రీషియన్, 37 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

కళాశాల విద్యా విభాగంలో 544 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో 491 లెక్చరర్ పోస్టులు, 24 లైబ్రేరియన్, 29 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మరో 2,440 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందన్న మంత్రి హరీశ్​రావు.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇప్పటి వరకు 49,428 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.

ఇవీ చూడండి..

అలుగులో చిక్కుకున్న పాఠశాల బస్సు.. స్థానికుల సాహసంతో పిల్లలు సేఫ్​..

భూమి కోసం ఒకరు.. భాష కోసం మరొకరు.. ఇద్దరు వృద్ధుల వినూత్న నిరసన

Last Updated : Jul 22, 2022, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details