Telangana Corona Cases: రాష్ట్రంలో కొవిడ్ కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో కరోనా కేసులు భారీగా పెరిగి.. 200 మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22,662 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 219 కేసులు నమోదు అయ్యాయి. 76 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,259 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
బీ అలర్ట్.. రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు - telangana corona New cases
బీ అలర్ట్.. రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
20:12 June 14
బీ అలర్ట్.. రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే 164 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
ఇవీ చూడండి..
ఆక్సిజన్ అందక సర్కారు దవాఖానాలో బాలింత మృతి.. కుటుంబీకుల ఆందోళన
భారత్లో మళ్లీ తగ్గిన కరోనా కేసులు.. అమెరికా, బ్రెజిల్లో ఉగ్రరూపం
Last Updated : Jun 14, 2022, 9:05 PM IST