తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో 21కి చేరిన కరోనా బాధితులు - Telangana Corona Positive Cases

Corona
Corona

By

Published : Mar 21, 2020, 3:20 PM IST

Updated : Mar 21, 2020, 5:04 PM IST

15:16 March 21

రాష్ట్రంలో 21కి చేరిన కరోనా బాధితులు

రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొవిడ్​-19 వైరస్​ సోకిన వారి సంఖ్య ఇవాళ్టికి 21కి చేరింది. యూఎస్​కు చెందిన క్రూజ్​ లాన్సర్​లో పనిచేసే 33 ఏళ్ల యువకుడు ఇటీవల దుబాయ్​ నుంచి వచ్చాడు. అతనికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు నిర్ధారణ అయింది.  

 ఈ రోగి హైదరాబాద్​లో సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తికి కూడా వైరస్ సోకిందని వైద్య పరీక్షలో తేలింది. రాష్ట్రంలో రోగి నుంచి మరొకరికి సోకిన కరోనా మొదటి కేసు ఇదే కావడం గమనార్హం. వీరిద్దరని గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి నివారణకు రేపు జనతా కర్ఫ్యూకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించింది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు రాష్ట్రంలో కర్ఫ్యూ ఉంటుందని ఇందుకు ప్రజలు సహకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. 

Last Updated : Mar 21, 2020, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details