ఏపీవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల తొలిదశ ప్రచారం ముగిసింది. ఈరోజు రాత్రి 7.30 గంటల వరకు అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేశారు. మొత్తంగా 12 జిల్లాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
గప్చుప్.. ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం
ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరగనుంది.
గప్చుప్.. ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం
తొలిదశలో 3,249 పంచాయతీల పరిధిలో 32,502 వార్డులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. 518 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2,731 పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఓటింగ్ ముగిశాక సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రక్రియ మొదలుపెడతారు. సర్పంచి, వార్డు మెంబర్ల ఫలితాలు వచ్చాక ఉపసర్పంచి ఎన్నిక నిర్వహిస్తారు.
TAGGED:
ఏపీ పంచాయతీ ఎన్నికలు న్యూస్