తెలంగాణ

telangana

ETV Bharat / state

1PM TOPNEWS: టాప్​న్యూస్@1PM - telangana topnews

ఇప్పటివరకున్న తాజా వార్తలు

1PM TOPNEWS
1PM TOPNEWS

By

Published : Mar 29, 2022, 12:58 PM IST

  • హైకోర్టులో మెమో దాఖలు చేసిన ఎక్సైజ్ శాఖ

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హైకోర్టులో ఎక్సైజ్ శాఖ మెమో దాఖలు చేసింది. ఈడీ అడిగిన అన్ని వివరాలు ఇచ్చినట్లుగా తెలిపింది.

  • 6 లైన్లుగా మారనున్న హైదరాబాద్-విజయవాడ హైవే..?

కేంద్రమంత్రి గడ్కరీతో విజయవాడ ఎంపీ నాని, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భేటీ దిల్లీలో అయ్యారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి 6 లేన్ల విస్తరణపై కేంద్రమంత్రితో ఎంపీలు చర్చిస్తున్నారు.

  • 18 గంటలు.. లాకర్​ గదిలో బంధి

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని యూనియన్ బ్యాంకు సిబ్బంది నిర్వాకం బయటకువచ్చింది. వృద్ధుడిని బ్యాంకులోనే ఉంచి తాళం వేసి సిబ్బంది వెళ్లిపోయారు. చివరకు ఏమైందంటే..

  • 'ఆ సంతకమే రైతుల మెడకు ఉరైంది..!'

ధాన్యం కొనుగోలు అంశంపై పార్లమెంటులో తెరాస ఎంపీల పోరాటం అబద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఒప్పందంపై సీఎం కేసీఆర్‌ చేసిన సంతకం.. రైతుల మెడకు ఉరితాడైందని ఆరోపించారు.

  • ఇద్దరు భార్యల ముద్దుల భర్తకు మహాకష్టం..

బిహార్ పూర్ణియా జిల్లాలో అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసు కౌన్సిలింగ్ సెంటర్​లో ఇద్దరు భార్యల మధ్య భర్తను పంచిన ఘటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పెళ్లైన విషయం దాచి తనను వివాహం చేసుకున్న భర్తపై రెండో భార్య పోలీసులను సంప్రదించగా.. కౌన్సిలింగ్​లో ఇలాంటి ఒప్పందం కుదిరింది.

  • రూ.40 కోట్లు విలువైన హెరాయిన్ సీజ్​

రూ.40 కోట్లు విలువ చేసే హెరాయిన్​ను సీజ్ చేశారు దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నారు.

  • 'ఆర్​ఆర్​ఆర్'​​పై తారక్​ భావోద్వేగం..

నటుడిగా తనను రాజమౌళి మరింత రాటుదేల్చాడని చెప్పారు యంగ్​టైగర్​ ఎన్టీఆర్​. తనలోని అత్యుత్తమ నటనను బయటపెట్టేందుకు జక్కన్న స్ఫూర్తినింపాడని అన్నారు. 'ఆర్​ఆర్​ఆర్'​ ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం మొత్తానికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

  • ఈ సీరియల్ తారకు ఎందుకంత క్రేజ్?

బుల్లితెరపై నాగిని అంటే మౌనీరాయ్​.. కానీ ఇప్పుడు తేజస్వి ప్రకాశ్​. ఈ అమ్మడు నటిగా ఇప్పటికే బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్​ సంపాదించుకుంది. సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటూ తన పోజులతో అభిమానుల్ని ఫిదా చేస్తోంది.

  • మరో దిగ్గజ సంస్థకు సీఈఓగా భారత సంతతి వ్యక్తి ​

ప్రముఖ కొరియర్‌ డెలివరీ సంస్థ ఫెడెక్స్‌కు భారతీయ అమెరికన్‌ అయిన రాజ్‌ సుబ్రమణియంను సీఈఓగా నియమిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుత సీఈఓ, ఛైర్మన్‌ ఫ్రెడెరిక్‌ డబ్ల్యూ స్మిత్‌ జూన్‌ 1 నుంచి ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.

  • అరంగేట్రంలోనే అరుదైన రికార్డు...

లఖ్‌నవూ జట్టు యువ ఆటగాడు ఆయుష్‌ బదోని మెగా టీ20 లీగ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సోమవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన అతడు.. తొలి గేమ్‌లోనే అంచనాలకు మించి రాణించాడు.

ABOUT THE AUTHOR

...view details