తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో 185 మంది ఉపాధ్యాయుల మృతి: యూటీఎఫ్

కొవిడ్ రెండో దశలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో మరణించటం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి విచారం వ్యక్తం చేశారు. నెల రోజులుగా ప్రతిరోజూ సగటున ఐదుగురు ఉపాధ్యాయులు మరణిస్తున్నారని తెలిపారు.

కరోనాతో 185 మంది ఉపాధ్యాయుల మృతి: యూటీఎఫ్
కరోనాతో 185 మంది ఉపాధ్యాయుల మృతి: యూటీఎఫ్

By

Published : May 14, 2021, 7:00 PM IST

కరోనాతో ఉపాధ్యాయులు మరణిస్తున్నారని టీఎస్ యూటీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. నెల రోజులుగా ప్రతిరోజూ సగటున ఐదుగురు ఉపాధ్యాయులు మరణిస్తున్నారని రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందన్నారు.

ఈనెల 14 నాటికి మరణించిన ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 185 మంది ఉపాధ్యాయులు మరణించారని... అందులో సర్వీసులో ఉన్నవారు 166 మంది, విశ్రాంత ఉపాధ్యాయులు 59 మంది ఉన్నారని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 25 మంది, హైదరాబాద్​లో 16 మంది మరణించారని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ, వరంగల్, ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్ ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయుల్లో 500 మందికి పైగా కరోనా బారిన పడగా ఇప్పటికే 15 మంది వరకు మరణించారని చెప్పారు.

మరణించిన వారిలో 40 ఏళ్లలోపు వారే అధికంగా ఉండటంపై విచారం వ్యక్తం చేశారు. కొవిడ్ చికిత్స కోసం స్థానిక ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరి లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ప్రాణాలు దక్కకపోగా కుటుంబాలు అప్పులపాలౌతున్నాయని చెప్పారు. కేజీబీవీ కాంట్రాక్టు ఉపాధ్యాయులకైతే ఏ ఆసరా లేక కుటుంబాలు వీధి పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం.. ఉపాధ్యాయుల కొవిడ్ మరణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వ్యాక్సినేషన్​లో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో నాలుగు నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, కాని రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే తిరిగి చెల్లిస్తుందన్నారు. అదికూడా రిఫరల్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి మాత్రమే అవకాశం ఉందని తెలిపారు.

ఇదీ చదవండి:పీఎం కిసాన్​ నిధులు విడుదల చేసిన మోదీ

ABOUT THE AUTHOR

...view details