CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,556 కరోనా కేసులు, 14 మరణాలు - Telangana covid news
18:50 June 15
కొత్తగా 1,556 కరోనా కేసులు, 14 మరణాలు
రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కొత్తగా 1,556 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 14 మంది ప్రాణాలు విడిచారు. కరోనా నుంచి మరో 2,070 మంది బాధితులు కోలుకున్నారు.
ప్రస్తుతం 19,933 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 1,20,043 కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 182 కరోనా కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 135, ఖమ్మం జిల్లాలో 131 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి.
ఇదీ చదవండి:Colonel santosh babu: సూర్యాపేటలో కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్