రాష్ట్రంలో కొత్తగా 1,416 కరోనా కేసులు, 5 మరణాలు - 1416 new corona cases in telangana
08:50 November 01
రాష్ట్రంలో కొత్తగా 1,416 కరోనా కేసులు, 5 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 1,416 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,40,048కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 279 కరోనా కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్ జిల్లాలో 112 కేసులు వెలుగుచూశాయి.
తాజాగా ఐదుగురు మృతి చెందగాా... మొత్తం మృతుల సంఖ్య 1,341కి చేరింది. వైరస్ నుంచి మరో 1,579 మంది బాధితులు కోలుకోగా... మొత్తం 2,20,466 మంది కొవిడ్‌ను జయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,241 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో 15,388 మంది బాధితులున్నారు.
ఇదీ చూడండి:కరోనా సెకండ్ వేవ్ మెుదటిసారి కంటే తీవ్రస్థాయిలో ఉండనుందా ?