ఏపీలో స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలకు 'వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం' కింద వడ్డీ చెల్లించేందుకు ఆంధ్రా ప్రభుత్వం రూ. 1400 కోట్లు విడుదల చేయనుంది. ఆ మేరకు రూ. 765 కోట్ల విడుదలకు అనుమతిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24న పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 6.9 లక్షల సంఘాల్లోని మహిళలకు రూ. 1000 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 1.8 లక్షల సంఘాల్లోని మహిళలకు రూ. 400 కోట్లు చెల్లించనున్నారు.
ఏపీలో సున్నా వడ్డీ పథకానికి రూ. 1400 కోట్లు - వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం తాజా సమాచారం
ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణమాఫీని నాలుగు విడతలుగా ఏపీ ప్రభుత్వం చెల్లించనుంది. 'వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం' కింద వడ్డీ చెల్లించేందుకు రూ.1400 కోట్లు విడుదల చేయనుంది. ఈ పథకాన్ని ఏప్రిల్ 24న లాంఛనంగా ప్రారంభించనుంది.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంఘాలకు రూ. 24,603 కోట్లు రుణాన్ని మాఫీ చేయాల్సి ఉంది. ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా చెల్లిస్తామని ప్రకటించింది. అప్పటి వరకు ఆరు నెలలకు ఒకసారి వడ్డీని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది. ఈ మేరకు గత ఆర్థిక సంవత్సరానికి (2019-20) సంబంధించి రెండు విడతల ( గత ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు) మొత్తం రూ. 1400 కోట్లు కానున్నట్లు ఏపీ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) సీఈవో రాజబాబు తెలిపారు.
ఇవీచూడండి:పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది
TAGGED:
ap latest scheme details