తెలంగాణ

telangana

ETV Bharat / state

భరత్​ను కఠినంగా శిక్షించాలి

హైదరాబాద్​లో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ మధులిక ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. మరో 24 గంటలు గడిస్తేగాని ఎటువంటి అంచనాకు రాలేమని తెలిపారు. బాధితురాలి కుటుంబాన్ని జీహెచ్​ఎంసీ మేయర్​ సతీమణి బొంతు శ్రీదేవి, మహిళాసంఘాల నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఘటనకు కారణమైన భరత్​ను నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్​ విధించింది.

విషమంగానే మధులిక ఆరోగ్యం

By

Published : Feb 7, 2019, 11:56 PM IST

విషమంగానే మధులిక ఆరోగ్యం
హైదరాబాద్​లో ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడ్డ ఇంటర్​ విద్యార్థిని మధులిక ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. మలక్​పేట యశోద ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో కృత్రిమ శ్వాసతో వైద్యులు చికిత్స చేస్తున్నారు. నిన్నటితో పోల్చితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుపడినా.. మరో 24 గంటలు గడిస్తే గాని ఎటువంచి అంచనాకు రాలేమని వైద్యులు వెల్లడించారు. తల, మెడ, దవడ, భుజాలు, చేతులపై తీవ్రగాయాలయ్యాయి. అధిక రక్తస్రావంతో కేవలం 3 శాతం హిమోగ్లోబిన్ మాత్రమే ఉందని వైద్యులు తెలిపారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని యశోద ఆసుపత్రి ఎదుట కుటుంబసభ్యులు, మహిళాసంఘాల నేతలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రేమోన్మాదుల వరుస దాడులతో భాగ్యనగరం వణికిపోతుందని జీహెచ్​ఎంసీ మేయర్​ సతీమణి బొంతు శ్రీదేవి ఆందోళన వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఏ పాపం ఎరుగని తమ కుమార్తెపై దాడి చేసిన భరత్​ను కఠినంగా శిక్షించాలని మధులిక తల్లిదండ్రులు డిమాండ్​ చేశారు.
నిందితుడు భరత్​కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్​ విధించింది. అనంతరం చంచల్​గూడ కేంద్ర కారాగానికి తరలించారు. మధులికపై పథకం ప్రకారం దాడి చేశాడా..ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details