13 GHMC Ward Offices Inauguration in Hyderabad Today : హైదరాబాద్ జంట నగరాల్లోని ప్రజలకు మొత్తం 150 వార్డు కార్యాలయాలు(GHMC Ward offices) అందుబాటులోకి వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో వార్డుకు.. ఒక వార్డు కార్యాలయాన్ని ప్రారంభించాలని మొదట నిర్ణయించినా.. సాధ్యం కాలేదు. దీంతో రెండు నెలల క్రితం 137 వార్డు కార్యాలయాలను ప్రారంభించారు. మిగతా 13 ఇవాళ నగరంలో ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు.. ప్రభుత్వం ఈ వార్డు కార్యాయలను ప్రారంభించినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది.
ఈ వార్డు కార్యాలయాల్లో ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు చేయడంతో.. వెను వెంటనే సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి వార్డు కార్యాలయానికి ఇంఛార్జీగా ఉండగా.. మొత్తం పది మంది వివిధ శాఖలకు చెండిన అధికారులు ఇక్కడ పని చేస్తున్నారు.
GHMC Ward Offices : వార్డు కార్యాలయాలు.. ప్రజల చెంతకే సేవలు
ఈ కార్యాలయాల్లో ఇంజినీరింగ్ సిబ్బంది, రోడ్లు డ్రైనేజీల వంటి వాటి నిర్వహణ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, భవన నిర్మాణం విషయాలపై, ఎంటమాలజీ విభాగం అధికారులు దోమల సమస్య, మహిళా సంఘాలకు ఉపయుక్తంగా ఉండేలా వార్డు కమ్యూనిటీ ఆఫీసర్, పారిశుద్ధ్య సిబ్బందిని సమన్వయం చేసుకునేందుకు వార్డ్ శానిటరీ జవాన్, అర్బన్ బయోడైవర్సిటీ సూపర్వైజర్, తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణకు సంబంధించి జలమండలి నుంచి వార్డ్ అసిస్టెంట్, విద్యుత్ శాఖకు సంబంధించిన ఒక ఆధికారి వార్డులైన్మెన్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఈ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారు.
Ward Office Administration in Hyderabad : వార్డు అధికారుల జాబ్ చార్టుతో పాటు పౌరుల ఫిర్యాదులను ఎంత కాలంలో పరిష్కరిస్తామో చెప్పే సిటిజన్ చార్ట్‌ని ఏర్పాటు చేశారు. స్థానిక వార్డు కార్యాలయానికి కాకుండా ఇతర వార్డు కార్యాలయంలో ప్రజలు ఫిర్యాదు చేస్తే.. వాటిని స్వీకరించి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సనత్‌నగర్‌లోని రాంగోపాల్‌పేట, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని భోలఖ్పూర్, అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని తిలక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వార్డ్ ఆఫీసులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.