తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓల్డ్​మలక్​పేట​: 11 గంటల వరకు 13.41 శాతం పోలింగ్ - GHMC Elections 2020

ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 9 వరకు 4.44 శాతం పోలింగ్​ నమోదు కాగా... 11 గంటల వరకు 13.41 శాతం నమోదైంది.

repolling
ఓల్డ్​మలక్​పేట​: 11 గంటల వరకు 13.41 శాతం పోలింగ్

By

Published : Dec 3, 2020, 11:29 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్‌ కొనసాగుతోంది. గుర్తులు తారుమారైన నేపథ్యంలో 69 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. రీపోలింగ్ దృష్ట్యా అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార కేంద్రాలకు సెలవు ప్రకటించారు.

అయితే ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు వేస్తున్నారు. ఓల్డ్ మలక్​పేట డివిజన్​లో ఉదయం 9 గంటల వరకు​ పోలింగ్​ 4.44శాతంగా నమోదుకాగా... 11 గంటల వరకు 13.41 శాతం ఓటింగ్ నమోదైంది.

ఇవీ చూడండి:ఓల్డ్ మలక్​పేటలో రీపోలింగ్

ABOUT THE AUTHOR

...view details