రాష్ట్రంలో కొత్తగా 1296 కరోనా కేసులు.. ఆరుగురు మృతి - తెలంగాణలో కరోనా కేసులు
22:03 July 19
రాష్ట్రంలో కొత్తగా 1296 కరోనా కేసులు.. ఆరుగురు మృతి..
20:47 July 19
రాష్ట్రంలో కొత్తగా 1296 కరోనా కేసులు.. ఆరుగురు మృతి..
రాష్ట్రంలో కొత్తగా 1,296 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 45,076కు చేరింది. ఆదివారం కొవిడ్‌తో ఆరుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 415కు పెరిగింది. వైరస్ నుంచి కోలుకుని 1,831 మంది డిశ్చార్జి కాగా... ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 32,438 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,224 యాక్టివ్ కేసులున్నాయి.
ఆదివారం జీహెచ్ఎంసీ పరిధిలో 557 కేసులు నమోదు కాగా.. వరంగల్ అర్బన్ జిల్లాలో 117 కేసులొచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 111, మేడ్చల్ 87, కామారెడ్డి 67, వరంగల్ రూరల్ జిల్లాలో 41 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కరోనా బారిన పడినవారిలో ఇప్పటి వరకు 72శాతం రోగులు కోలుకోగా... 0.92శాతం మంది మాత్రమే మృత్యవాత పడ్డట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసుల్లో... దాదాపు 10 వేల మంది హోమ్ ఐసోలాషన్లోనే ఉన్నారు. 16 ప్రభుత్వ, 23 ప్రైవేట్ ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహిస్తుండగా ... 33 ప్రభుత్వ, 75 ప్రైవేట్ ఆసుపత్రుల్లో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించింది.
ఇవీ చూడండి:మంత్రి ఔదార్యం.. తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడు