తెలంగాణ

telangana

ETV Bharat / state

Ap Corona update: ఏపీలో కొత్తగా 1,178 కేసులు.. 10 మరణాలు - ap news

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,178 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,23,242 మంది వైరస్‌ బారినపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,452 యాక్టివ్‌ కేసులున్నాయి. ఏపీలో ఇప్పటివరకు 2,70,37,651 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Ap Corona update
Ap Corona update

By

Published : Sep 7, 2021, 5:26 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 54,970 పరీక్షలు నిర్వహించగా.. 1,178 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,23,242 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 10 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,935కి చేరింది.

జిల్లాల వారీగా కొవిడ్​ కేసులు

24 గంటల వ్యవధిలో 1,266 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,94,855కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,452 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,70,37,651 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

ఇదీ చూడండి:Dr Sharada Suman: పుట్టిన బిడ్డను చూసుకోకుండానే కరోనాతో పోరాడి ఓడిన వైద్యురాలు

ABOUT THE AUTHOR

...view details