హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. జియాగూడ, గోడేకి కబర్, కట్టెలమండి ప్రాంతాల్లో రూ.95.58 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 1152 డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలపై... ప్రజల జీవననానికి అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించారు. ఉదయం పది గంటలకు జియాగూడ, 11 గంటలకు గోడే కి కబర్, పదకొండున్నరకు కట్టెల మండి ప్రాంతాల్లో... డిగ్నిటీ హోసింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.
భాగ్యనగరంలో 1,152 రెండు పడక గదుల ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు - హైదరాబాద్‌లో 1,152 డబుల్ బెడ్రూం ఇళ్ల గృహప్రవేశాలు
విజయదశమి కానుకగా పేదల సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేయనుంది. హైదరాబాద్ నగరంలో మూడు ప్రాంతాల్లో నిర్మించిన 1,152 డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
భాగ్యనగరంలో 1,152 రెండు పడక గదుల ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు
కార్యక్రమంలో మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు, డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు కౌసర్ మొహియుద్దీన్, రాజాసింగ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొనున్నారు.
ఇదీ చూడండి:సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్నాం.. ఎంతో కొంత తిరిగివ్వాలి: శ్రీనివాస్‌గౌడ్