ఉస్మానియా విశ్వవిద్యాలయం కొత్త సాంకేతికతను సమకూర్చుకుంటోంది. కేంద్రం అందిస్తున్న రూసా నిధులతో పలు కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
ఓయూకు రూసా - CENTERS
విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యనందించటానికి కేంద్రం రూసా ద్వారా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వందకోట్ల రూపాయలు ఇవ్వనుంది.
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో నాణ్యత పెంచాలనే ఉద్దేశంతో కేంద్రం 3వేల కోట్లతో ఈఐసీ హబ్ ప్రారంభించింది. ఈనెల 3న ప్రధాని నరేంద్రమోదీ శ్రీనగర్ నుంచి అంతర్జాలం ద్వారా దీనిని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఓయూకు వందకోట్లు అందనున్నాయి. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య రామచంద్రం, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు.
కేంద్రం నిధులతో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో టెక్నాలజీ బిజినెస్ సెంటర్, బయోడైవర్సిటీ, కన్జర్వేషన్ సెంటర్, మైక్రోబయల్ ఫెర్నెంటేషన్ టెక్నాలజీ, పారిశ్రామిక ఉత్పత్తుల పరీక్ష కేంద్రం, సైబర్ భద్రత కేంద్రం, అంబేడ్కర్ పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పనున్నారు.