ప్రఖ్యాత రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి అనారోగ్యంతో రాత్రి మృతి చెందారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఛాయాదేవి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆమె భౌతిక కాయాన్ని కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్‌కు తరలించారు. రాజమండ్రిలో జన్మించిన ఛాయాదేవి ప్రముఖ సాహితీ వేత్త అబ్బూరి రాజేశ్వరరావును వివాహమాడారు. దిల్లీలోని జేఎన్యులో లైబ్రేరియన్‌గా సేవలందించారు.
సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక రచనలు చేసారు అబ్బూరి ఛాయాదేవి. 'తను మార్గం' అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. తెలుగులో స్త్రీవాదం పుట్టక మునుపే యాభైయ్యో దశకం నుంచి స్త్రీ సమస్యల పట్ల రచనలు చేస్తూ సమాజాన్ని ఆలోచింపజేసిన వ్యక్తి ఛాయాదేవి అని ప్రముఖ రచయిత్రి మృణాళిని అన్నారు. ఆమె అన్ని తరాలకు ఒక ఆదర్శప్రాయమైన రచయిత్రి అని మృణాళిని పేర్కొన్నారు.