.
మహిళా మంత్రులపై ఊహాగానాలు రాష్ట్రంలో కాబోయే మహిళా మంత్రులెవరనే చర్చ మొదలైంది. శనివారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సమయంలో మహిళా మంత్రుల ప్రస్తావన రాగా కేసీఆర్ స్పందించారు. ఇంకా ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉందని, అందులో రెండు మహిళలకు ఇస్తామని ప్రకటించారు.
ఇవీ చదవండి : మంత్రివర్గంలోకి మహిళలు
అదృష్ణం ఎవరి తలుపు తట్టనుంది?
తెరాస నుంచి ముగ్గురు మహిళలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, గొంగిడి సునీత శాసనసభ్యులుగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఆకుల లలిత కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరారు. మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
సీనియార్టీ పరంగా పద్మాదేవేందర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. మంత్రివర్గంలో ఎస్టీలు లేనందున రేఖానాయక్, సత్యవతిలలో ఒకరికి పదవి ఖాయమనే ప్రచారం ఉంది. మొత్తంగా ఈ ఐదుగురిలో ఎవరికి స్థానం దక్కుతుందనే దానిపై భిన్న సమీకరణాలున్నాయి.
ప్రతిపక్షంలోంచి రానున్నారా?
కాంగ్రెస్ నుంచి ఓ మహిళ ఎమ్మెల్యే తెరాసలో చేరుతారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. తెరాసలో చేరినట్లయితే ఆమె పేరు కూడా పరిశీలనలో ఉండొచ్చునని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.