తెలంగాణ

telangana

ETV Bharat / state

ధ్రువపత్రం కోసం 55 రోజుల నిరీక్షణ... అయినా రాలే - srin kristafa

ప్రభుత్వ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు పొందాలంటే చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ మహిళ కులం సర్టిఫికేట్​ కోసం 55 రోజులుగా పోరాటం చేస్తోంది. ఇప్పటికీ ధ్రువ పత్రం రాలేదు. అదేంటని ప్రశ్నిస్తే సరూర్​నగర్​ రెవెన్యూ సిబ్బంది అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆమె వాపోయారు. ఈ విషయమై కలెక్టర్​ ఫిర్యాదు చేశారు బాధితురాలు.

బాధితురాలు

By

Published : May 8, 2019, 3:46 PM IST

ధ్రువపత్రం కోసం 55 రోజుల నిరీక్షణ... అయినా రాలే

కొత్తపేటకు చెందిన శ్రీరిన్​ క్రిస్టఫర్​ అనే మహిళ కుల ధ్రువీకరణ పత్రం కోసం సరూర్​నగర్​ ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. 55 రోజులు గడిచినా సర్టిఫికేట్​ రాలేదు. తహసీల్దార్​ కార్యాలయానికి వెళ్లి ప్రశ్నించగా ఆపరేటర్​ మురళిధర్​, సీనియర్​ అసిస్టెంట్​ ఫణిధర్​ అసభ్యపదజాలంతో దూషించారని ఆమె ఆరోపించారు. తాను దరఖాస్తు చేసిన ఒరిజినల్​ సర్టిఫికేట్స్​ చెత్తకుప్పలో పారవేశారని అన్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని సదరు బాధితురాలు కలెక్టర్​ లోకేష్​ కుమార్​కు ఫిర్యాదు చేశారు. ఇవీ చూడండి: దిల్ రాజు కార్యాలయంలో ఐటీ సోదాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details