ఇంటర్‌నెట్ వినియోగదారులు ఇకపై సొంత భాషలోనే తమకు కలిగే అన్ని రకాల అనుమానాలను నివృత్తి చేసుకునే విధంగా తొలిసారిగా 'వోకల్' పేరుతో ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. 11 భాషల్లో రూపొందించిన ఈ యాప్‌ను హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. దేశంలోని అతిపెద్ద స్థానిక భాషల ప్రశ్న-జవాబుల నాలెడ్జ్ షేరింగ్ యాప్ ఇదేనని సంస్థ వ్యవస్థాపకులు రాధాకృష్ణ, మాయాంక్, పవన్‌లు అన్నారు. వినియోగదారుల ప్రశ్నలకు నిపుణులు ఆన్లైన్లో సమాధానాలు ఇస్తారని వారు తెలిపారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిచే సమాధానాలు పొందేందుకు అవకాశం కలుగుతుందన్నారు. దేశంలోనే తొలిసారిగా ప్రశ్నలకు జవాబులను ఆడియో, వీడియో రూపంలో అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సందేహాలు నివృత్తి చేసుకోండిలా... - vokal
ఇంటర్‌నెట్ వినియోగదారులకు తరచూ వచ్చే ప్రశ్నలు, సందేహాల నివృత్తికి స్థానిక భాషల్లోనే సమాధానం ఇచ్చేందుకు ఓ యాప్ ఆవిష్కరించారు. వోకల్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ ద్వారా జవాబులను నిష్ణాతులు ఆడియో, వీడియో రూపంలో అందిస్తారని నిర్వాహకులు తెలిపారు.
సందేహాలు నివృత్తి చేసుకోండిలా...