తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాజ్యాంగాన్ని ఖూనీ చేసే విధంగా తెరాస విధానం' - undefined

కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తెరాసపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలతో పార్టీని తెరాసలో విలీనం చేయడంపై పలు ఆరోపణలు చేశారు. ఓటర్లలో అసంతృప్తిని ఇటీవలి లోక్​సభ ఫలితాలే వెల్లడిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

'రాజ్యాంగాన్ని ఖూనీ చేసేవిధంగా తెరాస విధానం'

By

Published : Jun 7, 2019, 9:48 AM IST

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను తెరాస ఎల్పీలో విలీనం చేయడంపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి తెరాసపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో తెరాస అధిష్ఠానం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉందని ఆమె ఆరోపించారు. అంపైర్​ను అడ్డంపెట్టుకుని వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్​లో గెలవాలి అనుకున్నట్లు... అసెంబ్లీ స్పీకర్​ను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్​లో...కాంగ్రెస్ శాసన సభ పక్షాన్ని విలీనం చేసినట్లు ప్రకటించడం గర్హనీయంమని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర విభాగాన్ని ఒక ప్రాంతీయ పార్టీలో విలీనం చేయడం అనేది చట్టపరంగా చెల్లుతుందా? అనే ప్రశ్నకు తెరాస సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకోవడంపై తెలంగాణ ఓటర్ల అసంతృప్తి... ఇటీవల జరిగిన లోక్​సభ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతోందని విజయశాంతి అన్నారు. ఈ ఫలితాలు చూసిన తర్వాత కూడా తెరాస ఆలోచన ధోరణి మార్చుకోకపోవడం దురదృష్టకరమని ఆమె పేర్కొన్నారు.

'రాజ్యాంగాన్ని ఖూనీ చేసేవిధంగా తెరాస విధానం'

ఇవీ చూడండి: ఇవాళ్టి నుంచి ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు

For All Latest Updates

TAGGED:

vijayashanti

ABOUT THE AUTHOR

...view details