తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నతండ్రే చంపాలని చూస్తున్నాడు...  ఫిర్యాదు - hyderabad

బంగారం కోసం కన్నతండ్రే తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ ఇద్దరు పిల్లలు బాలల హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తండ్రి నుంచి కాపాడాలంటూ బాలల హక్కుల సంఘంలో ఫిర్యాదు

By

Published : Jul 4, 2019, 10:16 PM IST

Updated : Jul 4, 2019, 11:43 PM IST

తమ పేరు మీద డిపాజిట్ చేసిన బంగారం స్వాధీనం చేసుకునేందుకు తమ తండ్రి చంపాలని చూస్తున్నారని... ఇద్దరు పిల్లలు బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. నారాయణగూడలోని బాలల హక్కుల సంఘం కార్యాలయంలో గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావును కలిసి ఫిర్యాదు చేశారు. నగరంలోని గాంధీనగర్​లో రాజ్​కుమార్, విజయలక్ష్మీ దంపతులు నివాసం ఉండేవారు. వారికి మయూర్ కుమార్, బేబీ లక్ష్మీ ఇద్దరు సంతానం. తండ్రి వేధింపులు భరించలేకనే తమ తల్లి గతేడాది డిసెంబరులో బలవన్మరణానికి పాల్పడినట్లు చిన్నారులు తెలిపారు.

చనిపోక ముందే తమ పేరు మీద బంగారాన్ని బ్యాంక్​లో డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. ఆ బంగారాన్ని చేజిక్కించుకునేందుకు చిన్న పిల్లలని కూడా చూడకండా హతమార్చేందుకు ప్రయత్నించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమను పెద్దమ్మ దగ్గరికి చేర్చాలని కోరారు. వారి ఆవేదన అర్థం చేసుకుని సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుత్​రావు, హైదరాబాద్ నగర అదనపు కమిషనర్ శిఖాగోయల్ దృష్టికి తీసుకెళ్లాడు. పిల్లలకు తగిన రక్షణ కల్పించాలని సెంట్రల్ జోన్ డీసీసీ విశ్వప్రసాద్​ను సీపీ ఆదేశించినట్లు తెలిపారు.

తండ్రి నుంచి కాపాడాలంటూ బాలల హక్కుల సంఘంలో ఫిర్యాదు

ఇదీ చూడండి: 'దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ గిడ్డంగుల సంస్థ'

Last Updated : Jul 4, 2019, 11:43 PM IST

ABOUT THE AUTHOR

...view details