తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణ బోనాలు ప్రపంచానికి చాటేలా నిర్వహిస్తాం' - ghmc officers

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు.

తెలంగాణ బోనాలు ప్రపంచానికి తెలిసేలా నిర్వహింస్తాం: తలసాని

By

Published : Jul 3, 2019, 6:39 PM IST

Updated : Jul 3, 2019, 7:46 PM IST

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం కొలువుండటం సికింద్రాబాద్ వాసులు చేసుకున్న అదృష్టమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న బోనాలు.. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై జీహెచ్​ఎంసీ కమిషనర్ దానకిశోర్​తో కలిసి సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


ఈసారి బోనాల ఉత్సవాలకు ప్రత్యేకంగా శ్రీ చక్రాన్ని తయారు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాల ఉత్సవాలు విశ్వవ్యాప్తం చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

తెలంగాణ బోనాలు ప్రపంచానికి తెలిసేలా నిర్వహిస్తాం: తలసాని

ఇదీ చూడండి: ఎర్ర చీమల గుడ్ల పచ్చడి...మీకు..తెలుసా...!

Last Updated : Jul 3, 2019, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details