నిరసనల దినం@ ఫిబ్రవరి 14 - vhp
వాలంటైన్స్ డేను వ్యతిరేకిస్తూ హిందూ ధార్మిక సంస్థలు చేసిన ప్రకటనలు ప్రేమికులకు ఇబ్బందికరంగా మారాయి. ప్రశాంతంగా కలిసి సంబరాలు చేసుకుందామనుకుంటే నిరాశే ఎదురైంది. కనిపించిన ఓ జంటకు భజరంగ్ దళ్ సభ్యులు పెళ్లి చేశారు. వాలెంటైన్స్ డేని వ్యతిరేకిస్తూ భారీగా నిరసనలు తెలిపారు. పోలీసుల ముందు జాగ్రత్త చర్యలతో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఈరోజు ప్రశాంతంగా ముగిసింది.
ప్రేమికుల రోజుకు వ్యతిరేకంగా నిరసనలు
మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో భజరంగ్ దళ్, ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు వాలెంటైన్ దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఆదిలాబాద్‌లో ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. పాశ్చాత్య సినిమా పోస్టర్లు చింపివేశారు.