అవార్డులనేవి రచయితలకు ప్రోత్సహంతో పాటు వారిలో నూతన ఉత్తేజాన్నిస్తాయని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ అన్నారు. వచ్చే ఏడాది విశ్వవిద్యాలయంలో కొత్త కోర్సులను ప్రారంభిస్తామని చెప్పిన ఆయన ... జూలై రెండో వారంలో ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంను మంత్రి జగదీష్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, విస్తరణ సేవ విభాగం ప్రతి ఏడాది అందజేసే సాహితీ పురస్కారాల ప్రదానోత్సంలో పాల్గొన్న ఆయన... అవార్డు గ్రహీతలకు 2017 సాహితీ పురస్కారాలను అందజేశారు.
'అవార్డులు నూతన ఉత్తేజానిస్తాయి' - telugu university
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఈరోజు 2017 సంవత్సరానికి సాహిత్య పురస్కారాలను అందజేశారు. విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్మిస్తున్న ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంను జూలై రెండో వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ తెలిపారు.
పద్య కవిత విభాగంలో మాల్యశ్రీ రాసిన మన్యభారతం, వచన కవిత విభాగంలో నారాయణస్వామి రాసిన వానొస్తదా , గేయ కవిత విభాగంలో తుమ్మూరి రాంమోహన్‌రావు రాసిన ఎలకోయిల పాట, బాల సాహిత్యంలో కొల్లూరు స్వరాజ్యం వెంకటరమణమ్మ రాసిన అనగా అనగా పిల్లల కథలు, కథానికి విభాగంలో బి. మురళీధర్ రాసిన నెమలినార, నవల విభాగంలో భూతం ముత్యాలు రాసిన మొగలి, సాహిత్య విమర్శ విభాగంలో అట్లా వెంకటరామిరెడ్డి రాసిన శైలీ శిల్పిం వెయ్యేళ్ళ తెలుగు కవిత్వం, నాటకం విభాగంలో భారతల రామకృష్ణ రాసిన స్వప్న సౌరభాలు, అనువాదం విభాగంలో మెహక్ హైదరాబాదీ రాసిన గుప్పిట జారే ఇసుక, వచన రచన విభాగంలో కోవెల సంతోష్‌కుమార్ రాసిన దేవ రహస్యం, రచయిత్రి ఉత్తమ గ్రంథం విభాగంలో జూపాక సుభద్ర రాసిన రాయక్క మాన్యం గ్రంథాలకు అవార్డులు అందజేశారు.