సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు దాదాపుగా 50 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వెల్లడించింది. అవినీతిపై తరుచుగా నివేదికలు విడుదల చేసే ఈ సంస్థ 2019 ఎన్నికల వ్యయంపై సర్వే నిర్వహించింది. అది 2014లో 30 వేల కోట్లుండగా... ఈసారి 50వేల కోట్లకు పెరిగినట్లు తెలిపింది. తెలంగాణలోని చేవెళ్ల, మల్కాజిగిరిలోనే 100 కోట్ల చొప్పున ఖర్చు చేసినట్లు అంచనా చేశారు. 18 ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లోనూ అవినీతి జరుగుతున్నట్లు ఆరోపించారు.
దేశమంతా 50వేల కోట్లు... చేవెళ్ల, మల్కాజిగిరిలో 200కోట్లు
ప్రపంచంలో ఏ దేశమూ చేయని ఎన్నికల ఖర్చు భారత్ చేసిందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వెల్లడించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు చేసిన వ్యయంపై సర్వే రిపోర్టు విడుదల చేసింది.
దేశమంతా 50వేల కోట్లు... చేవెళ్ల, మల్కాజిగిరిలో 200కోట్లు
ఇవీ చూడండి: విరాళాలతో అంగన్వాడీల అభివృద్ధి: మల్లారెడ్డి
Last Updated : Jun 18, 2019, 9:25 AM IST