కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, పేరిణితోపాటు తెలంగాణకు ప్రాణమైన ఆట, పాటలు ఒకే వేదికపై ప్రదర్శితమై కళాభిమానులను కనువిందు చేశాయి. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండో రోజు భారతీయ సంప్రదాయ నృత్యాంశాలను పలువురు యువ కళాకారులు ప్రదర్శించి మెప్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కృషి చేస్తే సరిపోదని... ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా పని చేసినప్పుడే నిజమవుతుందని శివకుమార్ అన్నారు. ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు.
'బంగారు తెలంగాణకు ప్రతి ఒక్కరి కృషి అవసరం' - undefined
బంగారు తెలంగాణ ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే సాధ్యమవుతుందని తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ శివకుమార్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భారతీయ సంప్రదాయ నృత్యాలను యువ కళాకారులు మెప్పించారు.
'బంగారు తెలంగాణకు ప్రతి ఒక్కరి కృషి అవసరం'
Last Updated : Jun 4, 2019, 6:57 AM IST
TAGGED:
formation day