శ్రీలంక వరుస బాంబు పేలుళ్లకు అనేక మంది పౌరులు మృతి చెందారు. ఉగ్రవాద దుశ్చర్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాంబుదాడి ఘటనను ఖండించారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు కేసీఆర్. కొలంబోలో జరిగిన ఉగ్రవాదుల చర్య అత్యంత హేయమైందన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శ్రీలంక బాంబు దాడి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. తీవ్రవాదులు శ్రీలంకలోని హోటళ్లు, చర్చిలపై క్రూరంగా బాంబు దాడి జరపడం హేయనీయమని ట్వీట్ చేశారు.
ఇవాళ ఉదయం శ్రీలంకలో జరిగిన బాంబు పేలుడు ఘటనపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రార్థన చేస్తున్న సమయంలో తీవ్రవాదులు బాంబు దాడి చేయడం పిరికితనం అని ట్విట్టర్లో పేర్కొన్నారు.