'స్త్రీ' మార్ట్ - chandanagar
మహిళలు ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండా, స్వయంగా ఎదిగేందుకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. షీ మార్ట్ పేరుతో చందానగర్‌లో మార్కెట్ ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలు ఇంటివద్ద తయారు చేసిన ఉత్పత్తులు స్వయంగా విక్రయించేందుకు వీలుగా చందానగర్‌లో షీ మార్ట్‌ను ఏర్పాటు చేసింది. పర్యావరణ హితమైన జ్యూట్ బ్యాగ్స్, ఇంట్లో తయారు చేసిన ఆహారపదార్థాలను ఇక్కడ అమ్ముతున్నారు. త్వరలో మరిన్ని రకాల పదార్థాలు, పళ్ల రసాలు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మార్ట్‌లో పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేకంగా ఓ గది కేటాయించారు. స్త్రీలు స్వయంగా ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామని మహా నగరపాలక సంస్థ ప్రకటించింది.