మీరు చేసిన తప్పుకు మాకెందుకు శిక్ష...? - govt
భవిష్యత్‌పై ఎన్నో కలలు కంటున్న ఇంటర్ విద్యార్థుల పాలిట ఇంటర్ బోర్డు ఫలితాలు తీవ్ర నిరాశనే మిగిల్చుతున్నాయి. అద్భుతంగా పరీక్షలు రాసి ధృడ విశ్వాసంతో ఉన్న ఓ విద్యార్థినికి జంతుశాస్త్రంలో 12 మార్కులు వేసి ఫెయిల్ చేయడం తీవ్ర దుఖాఃన్నే మిగిల్చింది. ఇలాంటి కథే రాష్ట్రంలోని చాలా మంది విద్యార్థులది.
మీరు చేసిన తప్పుకు మాకెందుకు శిక్ష...?
ఎన్నో ఆశయాలు... మరెన్నో కలలు... ఇంటర్మీడియట్లో రేయింబవళ్లు కష్టపడి చదివి భవిష్యత్‌పై కలలు కంటున్న ఇంటర్ విద్యార్థుల ఫలితాలు వారికి తీరని దుఖఃన్నే మిగిల్చాయి. కొల్లాపూర్ మహాదేవి జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తైన సానియాది అదే కథ. పరీక్షల్లో అద్భుతంగా రాసి ఎంతో విశ్వాసంతో ఉన్న సానియా జంతుశాస్త్రంలో ఫెయిల్ కావడం పట్ల తీవ్ర అసంతృప్తి, ఆందోళనలో ఉంది. మీ తప్పులకు మాకెందుకు శిక్ష అని ప్రశ్నిస్తోంది.