"భారత వాయుసేన ఉదయం 3.30 ప్రాంతంలో పాక్‌పై వైమానికి దాడులకు దిగింది. భారత్ దీన్ని(ఉగ్రవాదాన్ని) 1989 నుంచి దాదాపు 22 ఏళ్లుగా సహిస్తూ వస్తోంది. కశ్మీర్‌లోయలో తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తూ వస్తోంది.
'గట్టిగానే చెప్పారు' - interview
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత వాయుసేన వైమానిక దాడులను మాజీ ఆర్మీ అధికారులు స్వాగతించారు. సరైన సమయంలో తమ బలం చూపించి.. శత్రువుకు గట్టి హెచ్చరిక చేశారని కితాబిచ్చారు. సహనానికి కూడా హద్దు ఉంటుందని... భారత్ స్పందన సరైనదేనన్నారు.
2016లో ఉరి ఉగ్రదాడిలో కూడా మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా చిన్న సర్జికల్ స్ట్రైక్ చేసినప్పటికీ వాళ్లకు బుద్ధి రాలేదు. అంతకు ముందే కార్గిల్‌లో రెచ్చిపోతే సైనికులు ప్రతీకారం తీర్చుకున్నారు. ఇప్పుడు మన 40 మంది వీర జవాన్ల ప్రాణాలు బలిగొన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. పాకిస్థాన్ ఓటమి నుంచి ఏమీ నేర్చుకోలేదు. పాక్ ఎప్పుడూ తమకు తాము గొప్పగా ఊహించుకుంటుంది. అత్యంత బలహీనమైన ఆర్థిక వ్యవస్థ పాక్‌ది. కేవలం సైకిల్ కూడా తయారు చేసుకోలేదు. వాళ్లు గడ్డి అయినా తింటారు కానీ.. అణుబాంబు ఉందని ఆనందపడుతుంది. ఇది నేనంటున్న మాటలు కాదు స్వయంగా భుట్టోనే అన్నారు.
భారత్ చాలా దృఢమైనది అలాగే సున్నితమైనది. శాంతియుతంగా ఉండటం అన్నది మన రక్తంలో ఉంది. కానీ పాక్ ఎప్పుడైతే గీత దాటిందో భారత్ ధీటుగా తిప్పికొడుతుంది. దేశాన్ని కాపాడుతుంది. 40 మంది వీరులు మరణించారు. భారత బలమేంటో కచ్చితంగా చూపించాల్సిందే. భారత సైనికులు ధైర్యంగా ఎదుర్కొన్నారు. శత్రుమూకను తుదముట్టించి... పాకిస్థాన్‌కు గట్టి సమాధానమిచ్చారు."
- ఏఆర్కే రెడ్డి, మాజీ లెఫ్టినెంట్ జనరల్