సానియాను తొలగించండి
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా సానియా మీర్జాని తొలగించాలని గోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు.
సానియాను బ్రండ్ అంబాసిడర్గా తొలగించాలని రాజాసింగ్ డిమాండ్
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా సానియా మీర్జాను తొలగించాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కోడలిని ప్రచారకర్తగా కొనసాగించడం సరైంది కాదన్నారు. పుల్వామా ఉగ్రదాడిని దృష్టిలో పెట్టుకుని తన పుట్టినరోజును జరుపుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆయన అభినందించారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా సానియా మీర్జాను తొలగించి ఆమె స్థానంలో సైనా నెహ్వాల్ లేక పీవీ సింధును నియమించాలని రాజాసింగ్ కోరారు.